![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌజ్ లో గత రెండు రోజులుగా నామినేషన్లతో హీటెడ్ ఆర్గుమెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి మొదటి టాస్క్ ఇచ్చాడు. మొదటి జట్టు లో.. అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్, ప్రియాంక జైన్ ఉండగా, రెండవ జట్టులో శోభా శెట్టి, యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక మొదటి టాస్క్ కి సంచాలకులుగా శివాజీ వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు.
హౌస్ లోని కంటెస్టెంట్స్ రెండు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్. జిలేబీపురం వర్సెస్ గులాబీపురం టాస్క్ మొదలైంది. ఈ రెండు ఊరి శివార్లలో ఒక గ్రహాంతరవాసుల షిప్ ఆగిపోయిందని, వాళ్ళ వస్తువులు కొన్ని పోయాయని.. జిలేబీపురం, గులాబీపురంలో అవి ఉన్నాయని మీరు గెలిచి అవి తీసుకొస్తే మీలో ఒకరు కెప్టెన్సీ కంటెస్టెంట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇదంతా గ్రహాంతరవాసులని సంతోషపరిచే టాస్క్ అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే టాస్క్ జరిగేముందు రెండు ఊరిలోని వాళ్ళ క్యారెక్టర్ లతో ఫన్ జనరేట్ చేశాడు బిగ్ బాస్. అది పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలి. పర్ఫామెన్స్ వైజ్ గా అందరూ ఇరగదీశారు. ఛాయ్ అమ్మే వ్యక్తిగా అమర్ దీప్, జిలేబీపురం సర్పంచిగా శోభాశెట్టి, గులాబీపురం సర్పంచిగా ప్రియాంక జైన్, జిలేబీపురం సర్పంచి శోభా శెట్టి మాజీ భర్త పాత్రలో టేస్టీ తేజ, అంబటి అర్జున్ ఊరిలో రౌడి, అతనికి అసిస్టెంట్ కమ్ చెంచాగా పల్లవి ప్రశాంత్, ఇక ఊరిలో అందమైన అమ్మాయి అశ్విని శ్రీ.. తన చుట్టే అందరు అబ్బాయిలు తిరుగుతుంటారు. ఇక భోలే షావలి జ్యోతిష్యం చెప్పే వ్యక్తి, ఇక రెండు ఊర్లకి పెద్ద శివాజీ ఇలా హౌజ్ మేట్స్ అంతా తమ పాత్రలలో బాగా చేశారు.
ఇక మొదటి టాస్క్ లో జిలేబీపురం అత్యధిక గుడ్లని తీసుకెళ్ళి గెలిచారు. అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్ కలిసి ఈ టాస్క్ ఆడి గెలిపించారు. అయితే ఇరు జట్లకి ఒక్క గుడ్డు తేడానే ఉండటంతో శోభా శెట్టి ఎమోషనల్ అయింది. ఇది గేమ్ అంతే, నెక్స్ట్ గేమ్ మనం గెలుస్తామంటూ తనని ఓదార్చారు వాళ్ళ టీమ్ సభ్యలు. ఇక టాస్క్ లో ఇరు జట్లు తగ్గేదేలే అన్నట్టుగా చేశారు.
![]() |
![]() |